శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం తంగివాని పేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని సాధు మాధవరావుకు చెందిన గోదాం నుంచి రేషన్ బియ్యం భారీస్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో శనివా రం అర్ధరాత్రి దాడులు చేశారు. గోదాం నుంచి లారీకి లోడ్ చేసిన 22,300 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాధవరావు పలు గ్రామాల్లో కార్డుదారుల వద్ద చౌకగా రేషన్ బియ్యాన్ని కొనుగోలుచేసి, వాటిని రీసైక్లింగ్ చేసి కొత్తబస్తాల్లోకి మార్చి ఎగుమతి చేస్తున్నట్లుగా నిర్ధారించారు. వీటి విలువ రూ.8,47,400 ఉంటుందన్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఈ దాడిలో విజిలెన్స్ సబ్ఇన్స్పెక్టర్ అశోక్, సివిల్ సప్లయ్ అధికారి కిరణ్దేవ్ పాల్గొన్నారు.