సముద్ర అలలు ఏ రంగులో ఉంటాయో సముద్ర తీరాన్ని తిలకించిన వారందరికీ తెలుసు . కానీ గత రాత్రి భీమిలి తీరంలో సముద్ర అలలు రాత్రిపూట నీలం రంగులో కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇలా నీలి రంగులో ఉండడానికి కారణం కాలుష్యమేనని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. కెమికల్, డ్రగ్ పరిశ్రమలు విడిచిపెట్టే కాలుష్యాల వల్లే జలాలు కలుషితమై.. అక్కడ జీవించే ‘అల్గే’ (అతి సూక్ష్మ మొక్కలు)లు విడుదల చేసే రసాయనాలు రాత్రిపూట నీలి రంగులో మెరుస్తున్నాయని వివరించారు. విశాఖ తీరంలో రెండుచోట్ల అదే దృశ్యం కనిపించిందని విశాఖలోని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐవో) చీఫ్ సైంటిస్టు డాక్టర్ వీవీఎ్‌సఎస్ శర్మ తెలిపారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు.