రాష్ట్రంలో పరిణామాలను కేంద్రం గమనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ అధిష్ఠానం కూడా సీరియ్‌సగా ఉంది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నా రు. ఎంపీ సుజనా చౌదరితో కలిసి ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నడ్డాకు వివరించాను. ఎన్నికల్లో పొత్తులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. అయితే.. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఐడీ, పోలీసు శాఖ వైసీపీ తొత్తులుగా మారాయి. ఇదంతా కేంద్ర హోం శాఖ గమనిస్తోంది అని తెలియజేసారు.