వేసవి కాలం సంభవిస్తున్న నేపథ్యంలో, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉంది. ఐతే అగ్నిప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు సూచించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... విపత్తులను ఎదుర్కొనే సమయంలో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తారని అభినందించారు. కొవిడ్ సమయంలో కూడా వారు ఇలాంటి సేవలే అందించారని గుర్తు చేశారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని ఆ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అగ్ని నిరోధక యంత్రాల పనితీరును వివరించారు.