మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చిందెవరని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ నిలదీశారు. అంత డబ్బు ఎవరు ఇవ్వగలరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... ‘‘వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. రేపోమాపో ఎంపీ అవినాశ్‌రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు. అంతటితో ఈ కేసు పరిసమాప్తం కాదు. హత్యకు సూత్రధారులను అరెస్టు చేసినప్పుడే కేసు పరిసమాప్తం అవుతుంది’’ అని రఫీ అన్నారు.