మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం (నేడు) సీబీఐ ముందు హాజరు కావాలని అవినాశ్‌రెడ్డికి కూడా నోటీసులు జారీచేసింది. ఏడు గంటల విచారణ తర్వాత భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు మెమో జారీ చేశారు. 120బీ రెడ్‌విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్ సీజ్ చేసి, ఆయన భార్య లక్ష్మికి మెమో అందించారు.