‘‘వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో మొదటి నుంచి అందరికీ తెలుసు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి చిన్నచేపలు. ఇంకా విచారించి, శిక్షించాల్సిన వారు తాడేపల్లె ప్యాలెస్ లో ఉన్నారు అని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అన్నారు. ఇటీవల సీబీఐ విచారణ సందర్భంగా.. వివేకా కుమార్తె, అల్లుడే హత్య చేయించారంటూ అవినాశ్‌రెడ్డి... సునీల్‌యాదవ్ చేశాడని భాస్కర్‌రెడ్డి... వివేకా రెండో భార్యే చేయించిందని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సతీమణి తులశమ్మ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, టీడీపీ నాయకుల పాత్ర లేదనే విషయాన్ని వారే అంగీకరించారు. కాబట్టి బాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. న్యాయం గెలవాలి అని అవినాశ్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇపుడు కొంత వరకు న్యాయమే జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ జరిగి అందరికీ శిక్ష పడినప్పుడే వివేకా ఆత్మకు శాంతి చేకూరుతుంది. తప్పుచేసిన భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేస్తే పులివెందులలో, వేంపల్లెలోని నాయకులు ముఖ్యంగా వివేకాతో దగ్గరుండి పనులు చేయించుకున్న నాయకులు శాంతి ర్యాలీల పేరుతో నిరసన తెలపడం మంచిది కాదు. నిజాయితీగా బాధితులకు అండగా నిలవాలి’’ అని రవి అన్నారు.