మాజీ మంత్రి వివేకానందరెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన హంతకులను సీబీఐ అధికారులు అరెస్టు చేస్తే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం సిగ్గుచేటు’’ అని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ వైఎస్ భాస్కర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించింది. చట్టబద్ధంగా అరెస్ట్ చేసింది. సీబీఐ దర్యాప్తులో అవినాశ్‌రెడ్డి కుటుంబం పాత్ర ఉందని గూగుల్ టేకౌట్‌లో నిర్ధారణ అయింది. వివేకాను ఎవరు హత్యచేశారో పులివెందులలో ఎవరింటికి వెళ్లి అడిగినా చెబుతారు. మొత్తం వ్యవహారంలో ఎస్పీ అన్బురాజన్ వైసీపీ తొత్తుగా వ్యవహరించారు. అందుకే ఆయనను ఈ కేసు నుంచి బయటపడే వరకు బదిలీ కూడా చేయకుండా ఉంచుకున్నారు. అవినాశ్‌రెడ్డి ముద్దాయిగా తేలితే జిల్లాలో ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయిస్తానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు సవాల్ చేశారు. అలానే అయన మాట మీద నిలవాలని వరదరాజులరెడ్డి అన్నారు.