అల్లూరి జిల్లా చింతపల్లి లో బారీ గాజరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు మద్యం దూరమైంది. ఈ నెల 17నుండి 20 వరకు జరుగుతున్న జాతర సందర్భంగా మద్యం దుకానాలు బంద్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ సంబంధిత ఎక్సైజ్ అదికారులను ఆదేసించారు. ఏజెన్సీ లో ఘనంగా జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మద్యం దుకాణాలు బంద్ 21తెల్లవారుజామువరుకు అమల్లో ఉంటుందన్నారు.