ఏపీ సీఎం వైఎస్ జగన్ యూరప్ వెళ్లేందుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతించింది. కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 10న సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం పిటిషన్‌పై సీబీఐ ఈ నెల 17న కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29 వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి లభించింది. అయితే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పర్యటన వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa