ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న రాగిజావను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాగిజావ స్థానంలో విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడుల్లో భాగంగా ఉదయం 11 గంటలకే భోజనం పెడుతున్నారు. ఈక్రమంలో వేరుగా రాగిజావను అందిచే బదులు రోజూ పిల్లలకు చిక్కీలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాగిజావ పంపిణీని తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.