‘‘బీజేపీ, వైసీపీ పార్టీల మధ్య బంధం లేదని ప్రజలు అనుకోవాలి. మేం చెప్పగానే ప్రజలు విశ్వసించరు. ఆ పార్టీల మధ్య బంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నాడు గతంలో హేళనగా శుభాకాంక్షలు చెప్పిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈసారి సభ్యతగా శుభాకాంక్షలు చెప్పడంపై ప్రశ్నించినప్పుడు... ‘‘టీడీపీ అధికారంలోకి రాబోతోందని అందరికీ అర్థమయింది. గతంలో అవమానించిన వారు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును అడ్డగోలుగా విమర్శిస్తే ప్రజలు ఛీ కొడుతున్నారు. ప్రజల్లో మార్పు చూసి గతంలో అడ్డగోలు విమర్శలు చేసిన వాళ్లలో ఇప్పుడు భయంతో కూడిన మార్పు కనిపిస్తోంది’’ అని అన్నారు.