ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోళ్ల కోసం వచ్చి బావిలో పడిన ఎలుగుబంటి,,,బయటకు తీసేలోపే ప్రాణం వదిలింది

national |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2023, 09:11 PM

కేరళ రాష్ట్రం వెల్లనాడ్‌లో బావిలో పడిపోయిన ఎలుగుబంటి కథ విషాదాంతం అయ్యింది. బావిలో ఉన్న ఎలుగుబంటికి అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎలుగుబంటిని బయటకు తీసుకొచ్చినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎలుగుబంటికి అటవీశాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మత్తు మందు ఇచ్చాక చాలాసేపు నీటిలో ఉన్న కారణంగా bear చనిపోయిందని తెలుస్తోంది.


బుధవారం రాత్రి కన్నంపల్లికి చెందిన ప్రభాకరన్‌ అనే వ్యక్తి బావిలో ఎలుగుబంటి పడింది. ప్రభాకరన్ ఇంటి దగ్గర కోళ్లు ఉన్నాయి. ఎలుగుబంటి వాటిని పట్టుకునేందుకు వచ్చి.. బావిలో పడింది. ఎలుగుబంటి రెండు కోళ్లను పట్టుకుని తిన్న తర్వాత.. మూడో కోడిని పట్టుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయింది. శబ్దం విని బయటకు వచ్చిన కుటుంబీకులు ఎలుగుబంటిని చూశారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీసే ప్రయత్నం చేశారు.


తిరువనంతపురం జూకు చెందిన వైద్యుడు అలెగ్జాండర్ జాకబ్ నేతృత్వంలో.. ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చారు. ఎలుగుబంటి చాలా సేపటి క్రితం బావిలో పడిపోయిన కారణంగా బలహీనంగా ఉంది. అప్పుడు దాన్ని మామూలుగా బయటకు తీస్తే.. దాడి చేస్తుందన్న భయంతో మత్తు మందు ఇచ్చారు. మత్తు మందు ఇచ్చాక ఎలుగుబంటి స్పృహ కోల్పోయి నీటిలో మునిగిపోయింది. అటవీ శాఖ అధికారులు బావిలోకి దిగి తీసే ప్రయత్నం చేసినా.. అప్పటికే ఆలస్యం అయ్యింది. దీంతో ఎలుగుబంటి చనిపోయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com