ముస్లిం సోదరులకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అని ఎంపీ మోపిదేవి అన్నారు. నెల రోజుల ఉపవాస దీక్ష ముగించుకొని పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దయతో ముస్లిం కుటుంబసభ్యులందరూ సుఖ, సంతోషాలతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.