ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిచనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మీరు ప్రయాణించే రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ భోజన సౌకర్యం కల్పించనుంది. IRCTC నిబంధనల ప్రకారం రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తారు. కేవలం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు.