ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా, పొదలకూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపకార వేతనాలు తీసివేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు నిలిపివేసిందన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.