ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కో-చైర్మన్ వై.చెంచురామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా, ముత్తుకూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మనబడి, నాడు-నేడు రెండో విడత సమీక్షలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించాలని, ప్రభుత్వానికి ఇచ్చిన 50పేజీల మెమోరాండంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.