ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా మే 14న ఉండి నియోజవర్గంలో మినీ మహానాడు తరహాలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం భీమవరం టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా లోకేష్ యువగళం పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పితాని మాట్లాడుతూ సుమారు 10 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మినీ మహానాడు తరహాలో ఉండి నియోజక వర్గంలో సభ నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, ఎమ్మె ల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ వలవల బాబ్జి, మెంటే పార్ధసారధి, గొర్రెల శ్రీధర్, కోళ్ల నాగేశ్వరరావు, మద్దిపాటి ధర్మేంధ్ర, పాతూరి రామప్రసాద్ చౌదరి, డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.