గుంటూరు లో విద్యను పూర్తి చేసుకొని తమ జీవితాలకు బంగారు బాట వేసుకుంటూ ఉద్యోగాలు పొందిన విజ్ఞాన్ నిరులా మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను శనివారం రాత్రి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపీ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజ్ఞాన్ నిరులా కళాశాల నుండి ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, సిబ్బంది చేసిన కృషికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.