ఆయుర్వేదం ప్రకారం మాత్రం వండిన ఆహారాన్ని మూడు గంటల్లోగా తింటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ తర్వాత పోషక విలువలు తగ్గే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఆహారాన్ని 24 గంటల తర్వాత తింటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు ఆహారంలో బ్యాక్టిరియా అభివృద్ధి చెందడం మొదలైపోతుంది. ఈ ఆహారాన్ని మళ్లీ వేడిచేసినా కూడా ఆ బ్యాక్టిరియా పోయే అవకాశం లేదు. ఇలాంటి ఆహారాన్ని తినడంతో అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది.