తమిళనాడు ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాల్స్, బంక్వీట్, మ్యారేజ్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియంలలో మద్యం సరఫరా చేసుకోవచ్చని తెలిపింది. తమిళనాడు లిక్కర్ పాలసీ-1981కి తాజాగా స్టాలిన్ ప్రభుత్వం సవరణ చేసింది. ఈ పాలసీతో అతిథులు, సందర్శకులు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేవారికి మద్యం అందించడం మరింత సులభం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.