స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష సోమవారం నాటికి 802వ రోజుకు చేరుకుంది. దీంతో పలు యూనియన్ నాయకులు కార్మికులు పట్టు వదలని విక్రమార్కులవలె కేంద్రంతో నువ్వా, మేమా అనే హోరాహోరీగా దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రజా శాంతి పార్టీకి చెందిన కే ఏ పాల్ ఉక్కు దీక్షా శిబిరానికి చేరుకుని ఉద్యోగులకు తమ మద్దతు తెలిపారు. అనంతరం పాల్ మాట్లాడుతూ. 32 మంది అమరుల త్యాగం, 16 వేల మంది నిర్వాసితుల భూ దానం చేసిన స్టీల్ ప్లాంట్ నుఅమ్మాలని చూస్తే వూరుకోమని అన్నారు.
విశాఖ స్టీల్ ప్రవేటైజేషన్ చెయ్యాలనే అలోచన మోడీ మానుకోవాలనీ తెలిపారు. 2021 లో ప్రవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశానని చుసించారు. పోరాటకమిటీ నాయకులను లెటర్ ఇమ్మని రెండేళ్ళుగా అడుగుతున్న స్పందించడం లేదనీ అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలనీ దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తో చర్చిస్తాన్నారు. నిర్వాసితులకు, కార్మికులకు న్యాయం చేసేందుకు పార్టీలకు అతీతంగా పనిచేయ్యాలనీ కోరారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మాలంటే 32 అమరువీరుల కుటుంబాలకు 10 కోట్లు, నిర్వాసితులకు, కార్మికులకు 8 కోట్లు పరిహారమిచ్చి ఏమైనా చేసుకొనoడన్నారు