కృష్ణ జిల్లా, కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పేకాడుతున్న 29 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... ఫంక్షన్ ఉందంటూ పలువురు ప్రముఖలతో పాటు స్థానిక వైసీపీ నేతలు కోలవెన్ను గ్రామానికి చేరుకున్నారు. రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో పేకాట రాయుళ్లు హాజరవడం తో సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహిచి పలువురు వైసీపీ నేత లు, పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌ఈబీ సీఐ బాలరాజు చెప్పారు. అయితే ఈ శిబిరంలో బడా వ్యక్తులున్నట్టు సమాచారం. పోలీసులు పెద్దమొత్తంలోనే నగదు స్వాధీనం చేసుకుని ఉంటారని, కాకుంటే అసలు వివరాలు బయట పెట్టడం లేదని, పెద్దమొత్తంలోనే చేతులు మారినట్టు విమర్శలు వస్తున్నాయి.