ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ఇంచు కూడా కదలనివ్వను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2023, 12:25 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం పై రాజమహేంద్రవరం గేదెల నూకరాజు కల్యాణ మండపంలో సోమవారం రాత్రి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కోర్టులో గెలుస్తామని పాల్‌ చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో ఇప్పటిదాకా చేరారని, రిటైర్డ్‌ డీజీపీ శాంఘియా, ఐఏఎస్‌ రోషయ్య, డాక్టర్‌ కుమా ర్‌ గౌడ్‌లతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అనేకమంది చేరారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం కావడానికి పునాదులు వేస్తున్నామన్నారు. అవినీతి లేని రాజ్యం, అఽందరికీ అధికారం కోసం ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందని చెప్పారు. పది లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని, దానికి వడ్డి కట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం రాష్ట్రం లేద న్నారు. పది లక్షల కోట్ల అప్పుచేసిన ఈ సీఎంలు కావాలా, ఆ అప్పులు తీర్చగలిగి, గ్రామానికి కోటి రూపాయల నిధులు, సర్పంచ్‌కు 25 వేల జీతం ఇచ్చే కేఏ పాల్‌ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అలాగే హోదాను చంద్రబాబు తీసుకురాలేకపోయారని, జగన్‌ కాళ్లు కట్టేశారని ఎద్దేవా చేశారు. సమయం లేదు, ఏడాది మాత్రమే ఉందని ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాశాంతి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలతో ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రజాశాంతి పార్టీ నేత డాక్టర్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com