ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు అవసరం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 01:15 PM

విశాఖపట్టణం జిల్లా, ఎస్‌.రాయవరం మండలంలోని సర్వసిద్ధి గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ పాలనలో నిత్యావసర సరకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ రేట్లు, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి పేదలతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చేయడానికి పనులు లేక కూలీలు వలస పోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో అవసరమని అనిత అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com