చాలా మందికి చెమట అధికంగా పడుతుంది. ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒంటినుంచి దుర్వాసన రావడం, బట్టలు పాడైపోవడం వంటివి జరుగుతాయి. మరి వీటి నుంచి విముక్తి పొందడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ఎంతో మంచిది. వెనిగర్ తో చెమటలు అధికంగా పట్టడాన్ని అదుపులో పెట్టవచ్చు. 2టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి ఉదయాన్నే పడిగడుపున తాగితే మంచి ఫలితం అనేది ఉంటుంది.