ఆంధ్రప్రదేశ్ సూక్ష్మసేద్య పథకం ద్వారా 2023-24 సంవత్సరానికిగాను రాజమహేంద్రవరం జిల్లాలోని రైతులకు రాయితీపై డ్రిప్ పరికరాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సూక్ష్మసేద్య అధికారి జీఎస్ రామ్‌గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా 3 వేల హెక్టార్ల లక్ష్యానికి అనుగు ణంగా రాయితీపై 11 మైక్రో ఇరిగేషన్ కంపెనీల ద్వారా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఔత్సాహిక రైతులు డ్రిప్ పరికరాలు రాయితీ కోసం దరఖాస్తులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లోని వీహెచ్‌ఏ, వీఏఏల ద్వారా తగిన ధ్రువ పత్రాలతో వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం నల్లజర్ల మండలానికి సంబందించి 79950 86870, దేవరపల్లి, నిడదవోలు, గోపాలపురం మండలాలకు సంబంధించి 79950 86871, కొవ్వూరు, చాగల్లు, తాళ్ళపూడి, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు సంబంధించి 79950 86861, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం మండలాలకు 79950 86841, కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాలకు 79950 86840, రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలకు సంబంధించి 7995086839 నంబర్లలో సంప్రదించాలని కోరారు.