లంక మ్మమాన్యంలోని ఎలిమెంటరీ పాఠశాలలో ఆరోగ్య భారతి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో 50 మంది విద్యార్థులకు "బాల రక్ష" కిట్లను శనివారం పంపిణీ చేశారు. ఈ మందులు పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచి, కరోనా ఇత్యాది విషవ్యాధులను రానీయకుండా నిరోధిస్తాయని నాగాయలంక దీన దయాళ హాస్పటల్ వైద్యులు ఆరోగ్య భారతి రాష్ట్ర కోశాధికారి డాక్టర్ నారాయణ, డాక్టర్ రాధా దంపతులు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరి, డా. గుడిసేవ విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోమలి, అనూష, అప్సర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.