గుంటూరు సమీపంలోని గుంటూరు నుండి తెనాలి వెళ్లే మార్గంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన నాక్ ఏ ప్లస్ (నేషనల్ అసె్‌సమెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) గుర్తింపు వచ్చినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఫణీంద్రకుమార్ వెల్లడించారు. ఈ మేరకు సర్టిఫికెట్‌ను సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్యకు అందజేశారు. రాష్ట్రంలోని అతికొద్ది ఇంజనీరింగ్ విద్యాసంస్థలకే నాక్ గుర్తింపు ఉందని తమ కళాశాలకు మాత్రం నాక్ ఏ ప్లస్ లభించడం హర్షణీయమని డాక్టర్ రత్తయ్య పేర్కొన్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎన్‌బీఏ నుంచి 5 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు అక్రిడిటేషన్ లభించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa