ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీకాంత్‌కు వైసీపీ క్షమాణలు చెప్పాలి,,,.చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 09:32 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైఎస్సార్‌సీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అన్నారు.


సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదన్నారు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారన్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి అన్నారు.


విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. విజనరీ లీడర్.. విజన్ 2047తో ముందుకు సాగుతున్నారన్నారు. అదే కనుక జరిగితే దేశం బాగా డెవలప్ అవుతుందని కామెంట్ చేశారు.


విజనరీ లీడర్.. చంద్రబాబుపై రజినీకాంత్ పొగడ్తలు


ఏపీ మంత్రులతో పాటూ వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు రజినీకాంత్‌పై విమర్శలు చేశారు. రజినీకాంత్‌కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని.. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయం తెలియదా.. ఎన్టీఆర్ చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోలను రజినీకాంత్‌కు పంపిస్తామన్నారు. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు..... 


వైఎస్సార్‌సీపీ నేతలు రజినీకాంత్‌పై చేసిన విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది. సూపర్ స్టార్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదని.. చంద్రబాబు గురించి మాట్లాడితే అధికార పార్టీ నేతలకు వచ్చిన నష్టం ఏంటన్నారు. అలాగే రజనీకాంత్‌ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్‌సీపీ నేతలపై మండిపడుతున్నారు. రజినీకి క్షమాపణ చెప్పాలంటూ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. #YSRCPApologizeRajini అనే హ్యాట్‌ ట్యాగ్‌‌తో వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ హ్యాట్ ట్యాగ్‌ను తన ట్వీట్‌లో ప్రస్తావించారు. మొత్తం మీద వైఎస్సార్‌సీపీ వర్సెస్ రజినీకాంత్ ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ నడుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa