తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఎస్.సతీ్షకుమార్ మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అలాగే పెండింగ్ కేసుల వివరాలను సీఐ ఎస్కే అబ్దుల్ నబీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా జరుగుతోందని అనడమే తప్ప ఎవరూ సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నా రు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక నిఖా పెడతామన్నారు. గంజాయి అక్రమ సరఫరా, రవాణా చేస్తున్నట్టు ఎవరిదృష్టికి అయినా వస్తే నేరుగా తన నంబర్ 9494933233, 9440796500 తెలపవచ్చన్నారు.