తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ నిలిపివేసిన అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని విశాఖపట్టణం జిల్లా, కశింకోట టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళీ, తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా లేరన్నారు. జగన్మోహన్రెడ్డి వల్లే పారిశ్రామికవేత్తలు ఆంధ్రా వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. మంత్రి అమర్నాథ్ కనీసం గ్రామాల్లో వీధి దీపాలు కూడా వేయించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పప్పల అప్పారావు, మళ్ల బాబు, ఆడారి సన్యాసినాయుడు, మళ్ల గణేష్, మజ్జి నిరంజన్‌కుమార్, కలగా సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.