ఇదివరకు శంకుస్థాపనలు జరిగిపోయిన వాటికి కూడా మళ్లీ టెంకాయ కొట్టడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారు. టీడీపీ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన శంకుస్థాపన చేశారు. అవే ఎయిర్‌పోర్టు పనులకు నేడు జగన్ మరోసారి భూమిపూజ చేయనుండటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ శ్రేణులు తెలియజేసారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమని, నాలుగేళ్లుగా నిర్మాణాన్ని చేపట్టకుండా శంకుస్థాపన అంటూ జగన్ హడావుడి చేయడం ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేయడమేనని టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు విమర్శించారు. ఈ కార్యక్రమానికి జన సమీకరణ బాధ్యతలను జీఎంఆర్‌కు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.