నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి రౌడీ గ్యాంగ్‌లను పంపుతున్నారు. వాళ్లను చూసి ఆగిపోవడానికి తాడేపల్లి పిల్లిని కాదు బ్ర దర్.. నేను వేటాడే పులిని’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం అంటే పేదల గొంతుక అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో 87వ రోజైన మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరుల్లో యాత్ర సాగింది. గోనెగండ్ల మండలం గాజులదిన్నె క్రాస్ నుంచి 16.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆయన 1,119.7 కి.మీ. పూర్తిచేశారు. ఎమ్మిగనూరు టీడీపీ ఇన్‌చార్జి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు బీటీ నా యుడు, రామగోపాల్ రెడ్డి లోకేశ్‌తో కలిసి నడిచారు. కోడుమూరులో లోకేశ్ మాట్లాడుతూ.. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని, జగన్ అంటున్నారని.. మరి దేశంలోనే ధనవంతుడైన సీఎం ఎలా అయ్యారో.. చె ప్పే దమ్ముందా..? అని ప్రశ్నించారు.