రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావును బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లారామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నిజాంపట్నంలోని ఎంపీ మోపిదేవి స్వగృహంలో ఆయనను కలిసి రేపల్లె నియోజకవర్గం లో దివ్యాంగుల విభాగం కమిటీని నియమించాలని కోరారు. స్పందించిన ఎంపీ మోపిదేవి త్వరలో కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం జగన్ దివ్యాంగులు విభాగం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు చల్లారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. రేపల్లె వైసిపి దివ్యాంగుల నాయకుడు శీలం భరత్, బాలకృష్ణ పాల్గొన్నారు.