నాయుడుపేట - శ్రీకాళహస్తి బైపా్సరోడ్డు సమీపంలోని గోనెసంచుల గోదాములో ఓ మహిళ శవం బయటపడడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.... బైపా్సరోడ్డు సమీపంలో ఉన్న ఓ భవనాన్ని గోనెసంచులు నిల్వ ఉంచేందుకు సిద్ధయ్య, మల్లికార్జున్ అనే వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. రోజువారీగా గోనెసంచులను తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం భవనాన్ని ఖాళీ చేసేందుకు గోనెసంచులను తీస్తుండగా వాటి నడుమ మహిళ శవం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకున్న సీఐ నరసింహరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గుర్తుపట్టలేని స్థితిలో శవం వుండడంతో నెల రోజుల క్రితం మృతి చెంది వుండవచ్చని భావిస్తున్నారు. ఆమెకు 40 సంవత్సరాల వయసుంటుందని అంచనా వేశారు. నెలరోజుల క్రితం మృతి చెంది గోనెసంచుల నడుమ ఉన్న మృతదేహాన్ని దుర్వాసన వస్తున్నప్పటికీ నిర్వాహకులు తెలుసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.