కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కులం, మతం ఆధారంగా విద్వేషాలు వ్యాపింపజేసే బజరంగదళ్, పీఎఫ్ఐ తదితర సంస్థలను నిషేధిస్తామని ప్రకటించింది. బీజేపీ పాలనలో తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రకటనపై బీజేపీ మండిపడింది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆంజనేయస్వామిని అవమానించిందని విమర్శించింది.