తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కేవీబీపురం మండలం రాగిగుంట పంచాయతీ ఉప సర్పంచ్ మంగమ్మ కుమారుడు కటారి సురేష్ వైఎస్సార్ గృహసారథిగా ఉన్నాడు. తిమ్మసముద్రంలో ఓ ఇంటికి సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రధాన లైను ఇనుప కమ్మీలకు తగలడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం సురేష్ మరణించాడు. సురేష్ మృతితో స్వగ్రామమైన మర్రిగుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa