అచ్చుతాపురం: ఏపీఐఐసీ వైపులైను పరిహారం పంపిణీలో తెదేపా నాయకులు తెలిసి పాల్పడ్డారంటూ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, వైకాపా నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిరసన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెదేపా నాయకులు ప్రకటించారు. తెదేపా మత్స్యకార నాయకులు బుధవారం మండలంలో విలేకరులతో మాట్లాడారు. పైపులైను స్యాకేజీలో రూ. 2 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే కన్నబాబు, వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం ఉంటే ఈ నాలుగేళ్ల పాలనలో విచారణ చేయకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులు అవినీతికి పాల్పడిన నాయకులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు. పరిహారం పంపిణీ మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగితే అవినీతికి అవకాశం ఎక్కడ ఉంటుందన్నారు. అర్హులైన మత్స్యకారులకు నాలుగేళ్లగా ప్యాకేజీ ఇవ్వలేక తెదీపాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వైకాపా నాయకులకు సవాల్ విసిరారు. ఎన్నికలు ముందు 2013 భూ సేకరణ చట్టం ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షలు ప్యాకేజీ అందిస్తా ముని, ఇంటికో ఉద్యోగం అందిస్తామని మత్యకారులను మోసగించింది. వైకాపాయేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూడిమడకలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. శెట్టి నిర్మాణం, పూడిమడక పర్యాటక అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. తప్పుడు ఆరోపణ. లపై వివరణ ఇవ్వకుంటే ఎమ్మెల్యే కన్నబాబును పూడి మడకలో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మెదుగు బావునాయుడు, సమ్మింగ్ లక్ష్మణ్, పాన్నదుళ్ల కొండబాబు, మేరుగు మహేష్, కాసుబాబు, బంగారయ్య పాల్గొన్నారు.