ఎంపీపీల సంఘ సంక్షేమానికి విశేషంగా కృషి చేయాలని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఎంపీపీ రామిశెట్టి సత్య నారాయణకు సూచించారు. ఎంపీపీల రాష్ట్ర కార్యవర్గ సంఘ సభ్యుడిగా స్థానిక ఎంపీపీ రామి శెట్టి ఎంపికకావడంతో గురువారం ముదినేపల్లిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘానికి సరైన సూచనలు, సలహాలు అందిస్తూ ముదినేపల్లి మండలానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఎంపీపీని శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. కార్యక్ర మంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సం ధ్య, వైస్ ఎంపీపీలు చొప్పర్ల సునీత, రాచూరి రాధా, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ అల్లాభక్షు పాల్గొన్నారు.