బద్రీనాథ్ ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై హెలాంగ్ వద్దకు వాహనాల ద్వారా యాత్రికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అప్పటికే వాహనాలను నిలిపివేయగా.. వారంతా అక్కడే నిలబడి ఉన్నారు.ఈ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల్లోని యాత్రికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.