ఈ వేసవిలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి ఈ నెల 3 వరకూ దేశంలో సాధారణం కన్నా 28% అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. ముఖ్యంగా మధ్యభారత దేశంలో 268 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం 29% లోటు కనిపించింది. ఏప్రిల్ చివరలో చాలాచోట్ల వర్షాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.