ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు తీర్పు దురదుష్టకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2023, 02:37 PM

ఆర్‌-5 జోన్‌పై  రైతులు సుప్రీంకోర్టులో  వేయనున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌లో జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ఇంప్లిడ్ అవనున్నారు. సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా జడ శ్రావణ్ వాదలను వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ల్యాండ్ పులింగ్ ద్వారా ప్రభుత్వానికి భూ బదలాయింపు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి యాజమాన్యం హక్కులు పొందవని అభిప్రాయపడ్డారు. రైతులు వేసిన పిటిషన్ హైకోర్టు  కొట్టేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడటానికి తమ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్‌-5జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com