ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. కాగా.. ఫలితాల విడుదల సమయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జయాపజయాలు విద్యార్థులు పట్టించుకోకూడదని చెబుతూ.. ‘‘గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర డిప్యుటేషన్ పదవి వస్తుందని భావించి దిల్లీకి వెళ్లా. అక్కడ ఏపీ భవన్‌లో నా సీనియారిటీకి తగ్గ పదవి లేకపోయినా డిసెంబర్ వరకు వేచి చూసా. తిరిగి రాష్ట్రానికి వచ్చేసినా నేనేమీ నిరుత్సాహపడలేదు. భగవంతుడు ఏది రాస్తే అదే మనకు దక్కిన ఫలితంగా విద్యార్థులు భావించాలి’’ అంటూ విద్యార్థులకు ప్రవీణ్ సూచించారు.