డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సెల్ సమావేశం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈతకోట నాగేశ్వరావు అధ్యక్షతన అమలాపురంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొద్దకు నారాయణరావు (బాలు) పాల్గొని మాట్లాడుతూ.. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం ని చంపేసి, శవాన్ని డోర్ డెలివరీ చేసి దళితుల హృదయాలను గాయపరిచి, అవమానించడమే కాకుండా, రంపచోడవరం ఏజెన్సీ లో గిరిజనుల హక్కులను , సంపదను దోచుకుంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు ను ఇటీవల జరిగిన స్థానిక మంత్రి పినిపే విశ్వరూప్ తన గృహప్రవేశానికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేయడం సిగ్గు చేటు అని, అలాగే రాష్ట్రంలో జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో దళితుల పై ఇంతవరకు జరిగిన హత్యలు, దాడులు, హత్యాచారాలు పై వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యే లు కానీ కనీసం పట్టించుకోకపోవడం, నోరువిప్పకపోవడం సిగ్గు చేటని, రాష్ట్రంలో ఉన్న దళితులు యొక్క హక్కులను మీ ప్రభుత్వం కాలరాస్తున్నదుకు, దళితుల యొక్క 22 సంక్షేమ పథకాలను రద్దు చేసినందుకు దళిత జాతి యావత్తు మీ ఓటమికోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు.
జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు బడుగు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అంతబాబు ని విశ్వరూప్ తన గృహప్రవేశానికి పిలవడం దళిత జాతిని అవమానించడమే అని, విశ్వరూప్ కు సిద్ధాంతాలే లేవని, పదవి కోసం ఎంతకైనా దిగజారిపోయేలా ఆయన తీరు ఉంది అని విమర్శించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పొలమూరి ధర్మపాల్ మాట్లాడుతూ.. విశ్వరూప్ యొక్క అసమర్ధ అవినీతి పరిపాలన వల్ల కోనసీమ కేంద్రం అయిన అమలాపురంలో దళితుల పరువు నిర్ణయాలు, మర్యాదలు అనేవి మంటగలిసిపోతున్నాయి అని, ఆయన ఒక్కడు తీసుకొనే నిర్ణయాలు వల్ల అన్ని పార్టీల్లో ఉన్న మొత్తం దళిత జాతి అవమానాలు పడాల్సి వస్తుందని విమర్శించారు. అలాగే బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ.. అమలాపురం ఉన్న అంబేద్కరిజం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో ఎంతో గౌరం ఉండేది అని, కానీ అమలాపురం లో విశ్వరూప్ ఆడుతున్న కుటిల రాజకీయం వలన అమలాపురం అంటే లో ఉన్న గౌరవం పోయింది అని విమర్శిచారు. అమలాపురం కేంద్రం లో నాటి బివి రమణయ్య, పొలమూరి బాలకృష్ణ, బొజ్జా అప్పలస్వామి, బొజ్జా తారకం వంటి దళిత ఉద్దండులు దళిత జాతి గౌరవాన్ని పించి పోషించారని అలాంటి దళిత జాతి కీర్తిని విశ్వరూప్ కుటుంబం యొక్క రాజకీయ స్వార్ధంతో అవమానాలు పడాల్సి వస్తుంది అని విమర్శించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకుడు కన్నీడి. రమేష్, మండల, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుంచే వెంకన్నబాబు, నేమ తారక్, ఆకుమర్తి రమేష్, ముత్తబత్తుల రమణ, కుంచే రమేష్, తదితరులు పాల్గొన్నారు.