ఏపీలో విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల అనంతరం నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వలిపి సుహాసిని (15), నంద్యాల జిల్లాకు చెందిన కామాక్షి (16) ఉరి వేసుకుని మృతి చెందారు. ధర్మవరం మండలానికి చెందిన దినేశ్ కుమార్ విషం తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన శివకుమార్ మార్కులు తక్కువ రావడంతో ఆత్యహత్యాయత్నం చేశాడు