కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మాగాంధీ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని హేమశ్రీ పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటింది. ఈ బాలిక అసమాన ప్రతిభను ఇక్కడి ఉపాధ్యాయులు కొన్నాళ్ల కిందట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ ఆమె ప్రతిభకు మెచ్చి పదో తరగతి పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. టెన్త్ ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది.