ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో ఇద్దరికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకూ ఎవరికీ బెయిల్ లభించలేదు. తొలిసారిగా రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాకి ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరు రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. ఈ కేసులో ఫిబ్రవరి 7న గౌతమ్ మల్హోత్రా, ఫిబ్రవరి 8న రాజేష్ జోషిని ఈడీ అరెస్ట్ చేసింది.