మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియో సదుపాయం ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఎఫ్‌ఎం రేడియో సేవలు ఎంతో కీలకంగా మారతాయని కేంద్రం పేర్కొంది. ఫోన్లలో ఎఫ్‌ఎం డియాక్టివ్ చేయకుండా చూడాలంది. స్మార్ట్‌ఫోన్లతో పాటూ స్టాండ్ ఎలోన్ రేడియోలు, కార్లలో రేడియో రిసీవర్లూ అవసరమని ఐటీ మంత్రిత్వ శాఖ తన స్పష్టం చేసింది.