ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని అనుగుణంగా ప్రణాళికాయుక్తముగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి పది మందికి ఆదర్శం కావాలని జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, టాపర్గా నిలిచిన కేజీబీవీ సారవకోట నందు చదువుతూ 600 మార్కులకు 590 మార్కులు సాధించిన విద్యార్థిని ఉర్లాన జాహ్నవిని అభినందించ డానికి జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఉప విద్యాశాఖ ఆధికారి పగడాలమ్మలు సోమవారం నాడు మెలియాపుట్టి మండలం లోగల సానిపాలెంగ్రామం వెళ్లి విద్యార్థిని ఇంటికి వెళ్లి శాలువా కప్పి సన్మానం చేసి, అభినందించారు.
ఈ అభినందన సభ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య తోపాటు ఉప జిల్లా విద్యాశాఖధికారి పగడాలమ్మ, హిరమండలం, మెలియాపుట్టి మండల విద్యాశాఖధికారులు రాంబాబు, ఎస్. దేవేంద్రరావు, జాడుపల్లి పాఠశాల హెచ్ఎం. పి. రామారావు, ఉపాధ్యాయులు అట్ల రవి, రామకృష్ణ, ఏ. సుదర్శనరావు, సర్పంచు రామచంద్రమజ్జి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ వై. లింగరాజు, ఎం. రవీంద్ర, సీఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, మండల పరిధిలోగల అన్ని పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కిల్లంశెట్టి సాత్విక (చాపర), టీ. జోత్స్నా (జాడుపల్లి), ఎన్. మానసచంద్ర (పెద్దలక్ష్మీపురం), ఎస్. దివ్య (బంద పల్లి), తోపాటుగా గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులున్నారు.